జంగ్ సైరన్!

20-10-2026 | 05:40am

నవంబర్ 7న హైదరాబాద్‌లో నిరుద్యోగుల మహార్యాలీ

పోరుకు సిద్ధం.. గ్రూప్స్, డీఎస్సీ, ఎఫ్‌బీవో, జీపీవో ఖాళీల భర్తీకి డిమాండ్

అక్టోబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణలో నిరుద్యోగులు(Unemployed people) పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో సమరశంఖం పూరించనున్నారు. నవంబర్ 7న భారీ ర్యాలీ(Massive rally) చేపట్టేందుకు ఉద్యుక్తమవుతున్నారు. హైదరాబాద్ వేదికగా వేలాది మంది నిరుద్యోగులు తమ నిరసన గళం వినిపించనున్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లేదా అశోక్‌నగర్ నుంచి ధర్నా చౌక్(Dharna Chowk) వరకు ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జీపీవోతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి(Filling of posts) వెంటనే నోటిఫికేషన్లను జారీ చేయాలని సర్కారుకు సవాల్ విసరనున్నారు. నిరుద్యోగ జేఏసీ(Unemployed JAC) ఆధ్వర్యంలో పోరుకు సన్నద్ధమవుతున్నారు. 

గుర్రుగా నిరుద్యోగ యువత..

ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు చాలా గుర్రుగా ఉన్నారు. నోటిఫికేషన్లు(Notifications) రావడం లేదని, వచ్చినా పరీక్షలు నిర్వహించడం లేదని, పరీక్షలైనా ఫలితాలు తొందరగా ఇవ్వడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల(Coaching centers) చుట్టూ తిరిగి అప్పులు చేసి చదువుతున్నా ఉద్యోగాలు(Jobs) రాక తీవ్ర నిరాశలో ఉన్నామని వాపోతున్నారు. ఒక్కోసారి మనోధైర్యం కోల్పోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే తమ వంతవుతోందని అసంతృపిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరుస నోటిఫికేషన్లు వేస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక కేవలం జాబ్ క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకుందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 

భారీగా తరలివచ్చేలా..

ఈ ర్యాలీకి అన్ని ప్రాంతాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు భారీగా తరలిరానున్నట్లు సమాచారం. ఇది ఏ పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదని, నిరుద్యోగులందరి సమస్య అని స్పష్టం చేస్తున్నారు. నేరుగా ఫోన్‌లు చేసి భారీ సంఖ్యలో విద్యార్థులను, యువతను సమీకరించనున్నారు.  గ్రూప్స్, డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, జీపీవో ఇలా అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిని ఏకం చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సరిగా నోటిఫికేషన్లు జారీ కావడంలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వరుస నో టిఫికేషన్లు జారీ అవుతున్నాయి.

ఏపీలో 2014 నుంచి ఐదు సార్లు గ్రూప్1, నాలుగు సార్లు గ్రూప్ 2 నోటిఫికేషన్లు వెలువడగా, తెలంగాణలో గ్రూప్1 ఒకసారి, గ్రూప్2 రెండుసార్లే నోటిఫికేషన్లు జారీ అ య్యాయని నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల 2 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులకు కూడా ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేష న్ వేయడం గమనార్హం. ఏపీ తరహాలోనే మనదగ్గర కూడా వరుస నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేద ంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. 

పలువురు ఇంటిముఖం.. 

గత బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నదని యువత మండిపడుతోంది. సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్‌లకు, హాస్టల్, రూమ్ ఖర్చులకు రూ.లక్షల్లో ఖర్చు అవుతున్నదని, తల్లిదండ్రులు అప్పులు చేసి తమకు డబ్బులు పంపిస్తున్నారని వాపోతున్నారు. యేటేటా అప్పులు పెరిగిపోతున్నా యి కానీ, జాబ్ నోటిఫికేషన్లు రావడంలేదని, చేసేదేమీ లేక చాలా మంది నిరుత్సాహంతో ఇంటిముఖం పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు