ట్రంప్‌నకు 139 కోట్ల లాభం

25-11-2026 | 05:05am
  1. జెన్సన్ రాకతో ఎన్విడియాకు 92 లక్షల కోట్లు లాభం
  2. హువాంగ్ లాభం 3.15 లక్షల కోట్లు
  3.    31.5 శాతం పెరిగిన షేర్లు
  4. తానే రప్పించానన్న అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్, నవంబర్ 24: ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్‌ను(Jensen Huang as NVIDIA CEO) నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) భారీ లాభం చేకూరింది. ఎన్విడియాలో ట్రంప్‌నకు ఉన్న 3.70 లక్షల షేర్ల విలువ 15 మిలియన్ డాలర్లు (రూ. 139 కోట్లకు పైగా) పెరిగింది. తాజాగా ప్రకటన వెలువడగానే సంస్థ షేర్లు 31.5 శాతం ఎగిసిపడి లాభాలనార్జించాయి. సంస్థలో జెన్సన్‌కు ఉన్న షేర్లు కూడా భారీ లాభాలను పొందాయి. దీంతో ఆయన నికర సంపద 144 బిలియన్ పెరిగింది. జెన్సన్‌కు రూ. 3.15 లక్షల కోట్లు లాభం చేకూరింది.

కాగా జెన్సన్ పునరాగమనాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో(Truth Social) పోస్టు చేశారు. మరోవైపు జెన్సన్ నికర సంపద కూడా 144 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫోర్బ్స్ జాబితాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో 10 నుంచి ఏకంగా 18వ స్థానానికి పడిపోయిన జెన్సన్ తాజాగి ఎన్విడియా షేర్లు దూకుడును ప్రదర్శించడంతో ఏకంగా 13వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్విడియా షేర్లకు ఒక్కరోజులోనే రూ. 92 లక్షల కోట్లు లాభం చేకూరి సంస్థ సంపద 3.98 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

వివాహేతర సంబంధాలు(Extramarital relationships), చైనీస్ గూఢచారి ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు(NVIDIA Board) ఆయన్న నవంబర్ 12న సీఈవో పదవి నుంచి తొలగించింది. కాగా తన జోక్యంతోనే జెన్సన్ తిరిగి సీఈవోగా నియమితులయ్యారని, బోర్డుతో మాట్లాడి ఒప్పించానని ట్రంప్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా జెన్సన్ హువాంగ్ తిరిగి రావడంతో యూఎస్ హౌస్ దర్యాప్తు ముగియదని కొనసాగుతుందని ముగ్గురు కీలక కమిటీల చైర్మన్లు ప్రకటించడం కొసమెరుపు. 

ఎన్విడియా బోర్డుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భరోసా..

జెన్సన్ తిరిగి రప్పించాలనే ఆ బాధ్యతను ట్రంప్ ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌కు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన వాన్స్ బోర్డు సభ్యులతో విస్తృతంగా చర్చలు జరిపి ఆయన చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని ఎలాంటి ఆధారాలు లభించలేదని భరోసా ఇచ్చారు. మరోవైపు జెన్సన్ తిరిగి రాకలో అమెరికా వాణిజ్యశాఖ మంత్రి లుట్నిక్, ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్‌లు కూడా కీలకపాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు