భారత్ ఇంధన వ్యూహాన్ని ప్రశంసించిన మార్క్ రూబియో
21-10-2026 | 06:41am
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత ఇంధన కొనుగోళ్ల వ్యూహాన్ని ప్రశంసించారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అనంతరం మాట్లాడుతూ.. తన ఇంధన పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవాలనే భారత నిర్ణయం తెలివైనదని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా కూడా ఇంధన సరఫరాదారుగా ఉండగలదని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని సేకరించే ప్రక్రియను ఆయన సమర్థించారు.