తెలుగు రాష్ట్రాల్లో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

21-10-2026 | 06:35am

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. బుధవారం ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. పోలవరం, కోనసీమ, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, ఉమ్మడి తిరుపతి, ప్రకాశంలో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలో భద్రాద్రి, KMM, ఉమ్మడి నల్గొండ, MBNR జిల్లాల్లో ఇవాళ ఉదయం 8:30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరిన్ని వార్తలు