ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి కౌంట్‌డౌన్!

21-10-2026 | 06:56am

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశముంది. రెండో విడత ఇళ్ల కేటాయింపునకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా తర్వాత వారంలోగా లాటరీ ప్రక్రియను పూర్తి చేసి, దీపావళి పండుగకు ముందే లబ్ధిదారులను ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ విడతలో ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన అర్హులకు ఇళ్లను కేటాయించనున్నారు. లాటరీ ప్రక్రియ పూర్తయితే సొంతింటి కల నెరవేరుతుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాల్లో ఆనందం నెలకొనే అవకాశం ఉంది. రెండో విడత కేటాయింపులపై అధికారుల సన్నాహాలు ముమ్మరం కావడంతో ఆశావహుల్లోనూ ఉత్కంఠ పెరుగుతోంది.

మరిన్ని వార్తలు