23 March, 2026 | 8:44 PM

సిరిసపల్లి డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా దీక్ష

23-03-2026 05:52 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): మునిసిపాలిటీల చెత్తను సేకరించి హుజురాబాద్ సమీపంలోని డంప్ యార్డుకు తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం సిర్సపల్లి గ్రామస్థులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన దీక్షలు చేపట్టారు. డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల తాముఅనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందనిస్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సిర్సపల్లి-కొత్తపల్లి సమీపంలో డంప్ యార్డు ఏర్పాటుచేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని, సిర్సపల్లి వాసులు డిమాండ్ చేశారు.

డంప్యార్డు ప్రభావం పంటలపైకూడాతీవ్రంగాపడునుందని దీనివల్ల ఆహారం విషతుల్యంగామారే ప్రమాదం లేకపోలేదనిస్థానికులుఅంటున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకునితాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనంసాగించాల్సిన దుస్థితి నెలకొంటుందని నిరసనల కారులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిబండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నంప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్, మండలి విప్ బల్మూరి వెంకట్, ఇంఛార్జి వొడితెల ప్రణవ్ బాబుల మద్దతు కూడగట్టుకుని ముందుకు సాగనున్నామన్నారు.

నిరసన దీక్షా శిబిరంలో అఖిల పక్షం కో ఆర్డినేటర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, సిర్సపల్లి సర్పంచ్ పోల్సాని రామారావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బండ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాజపల్లి సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జయన్న ఫౌండేషన్ అధ్యక్షడు జయపాల్ రెడ్డి, న్యాయవాది ముక్కెర రాజు, ఎవల్లి కొండాల్ రెడ్డి, జనగామ రాజ్ కుమార్, విజయ్ కుమార్, వెంకట్రావు, వేమారెడ్డి, వెంకట్ రెడ్డి, కల్లెపు హన్మంత రావు, పద్మారెడ్డి, ఐలయ్య రుద్రారపు రాయచంద్రం, కామకోటి కిషన్ రావు, ఐలయ్య, రవిందర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.