13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆవంచ ఐశ్వర్య గణపతి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం

23-03-2026 08:16 PM

- పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం..

- మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి

జడ్చర్ల: ఆవంచ గ్రామంలోని ఏకశిలా గణపతి విగ్రహం దేశంలోనే అతి పురాతన ఏకశిలా విగ్రహాల్లో ప్రసిద్ధిగాంచింది అని ఐశ్వర్య గణపతిగా పిలువబడే స్వామివారికి అత్యంత అద్భుతంగా ఆలయ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ మంత్రి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  మాజీ మంత్రి మాట్లాడారు. ఇప్పటికే ఒక ట్రస్ట్ వారు ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చారని, ఆ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తానే స్వయంగా ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఐశ్వర్య గణపతి చుట్టూ 32 వినాయక రూపాలకు సంబంధించి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, సుమారు 6 ఎకరాల స్థలంలో ఉన్న ఐశ్వర్య గణపతి ని అత్యంత అద్భుతంగా పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని అందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు. అందరి సహకారంతో తానే ముందుండి ఈ అద్భుత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనునట్లు పేర్కొన్నారు. ఎందుకు సంబంధించి అతి త్వరలోనే ప్రజలందరి సహకారంతో ప్రత్యేక కార్యాచరణ  రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాలై ముందుకు సాగుదాం అని పేర్కొన్నారు.