calender_icon.png 21 January, 2026 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలి

20-01-2026 12:00:00 AM

  1. ఖమ్మం సభ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం ప్రసంగం

రాజకీయ విద్వేషాలు, హింసను రెచ్చగొడుతున్నారు 

అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్  

అన్ని జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో బీఆర్‌ఎస్ ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్, పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమా రం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలు పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయని, ఆయనపై సుమోటోగా కేసులు నమోదు చేయా లని బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవ ణ్ డిమాండ్ చేశారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజంలో అశాంతిని రేకెత్తించేలా మాట్లాడటం సరికాదని మండిప డ్డారు. ఈ మేరకు సోమవారం బీఆర్‌ఎస్ బృందం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ రా జ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, అదే రాజ్యాంగానికి, శాంతిభద్రతలకు విఘా తం కలిగించేలా మాట్లాడటం దారుణం. ఆయన మాటలు రాజకీయ విద్వేషాలను పెంచేలా, సమాజంలో హింసను ప్రేరేపించేలా ఉన్నాయ న్నారు.

పోలీసులు తక్షణమే స్పందించి సీఎం రేవంత్ రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సీఎం వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేసిన సోషల్ మీడియా హ్యాం డిల్స్, మీడియా సంస్థలపైనా చర్యలు తీసుకోవాలని శ్రవణ్ కోరారు. అలాగే మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో బీఆర్‌ఎస్ శ్రేణులు సీఎంపై ఫిర్యాదులు చేశాయి. డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగులు, ఆధారా లను జతచేసినట్లు నేతలు తెలిపారు.