20-01-2026 12:00:00 AM
నాచారం ఈఎస్‌ఐ హాస్పిటల్ వద్ద అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన
ఐదు నెలలుగా జీతాలు చెల్లించని యాజమాన్యం
జీతాలు ఇచ్చేదాకా ప్రతిరోజూ ధర్నా చేస్తామని హెచ్చరించిన ఉద్యోగులు
కుషాయిగూడ, జనవరి 19 (విజయక్రాంతి): పెండింగులో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాచా రం ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగు లు సోమ వారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రెండు గంట ల పాటు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎం నరసింహ, ఉద్యోగులు మాట్లాడుతూ.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా, యాక్టివిటీ సెక్యూరి టీ సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
జీతాలు రాక కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వేతనాలు అందే వరకు ప్రతిరోజూ ధర్నా చేస్తామని హెచ్చరించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఈఎస్‌ఐ, పీఎఫ్ మొత్తాలను తక్షణమే చెల్లించాలని ఏజెన్సీ యాజ మాన్యాన్ని కోరిం ది. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షురాలు విక్టోరియా, నాయకులు వేణు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగు తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నర్సింగ్‌రావు, కార్యదర్శి లింగమ్మ, ఉప కోశాధికారి సుధ, కార్యదర్శి క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు నరసింహ, అశోక్, రాజేష్, నిరన్కా కౌర్, ఉజ్వల్, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.