calender_icon.png 21 January, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెపుతాం

20-01-2026 12:00:00 AM

  1. మున్సిపల్‌లో బీసీలకు అన్యాయం చేయొద్దు

రిజర్వేషన్లు పెంచినంకనే ఎన్నికలు జరపాలి

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద  అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన 

ముషీరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): మేడారంలో జరిగిన రాష్ర్ట క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై కనీసం చర్చించలేదని, బీసీ రిజర్వేషన్లపై చర్చించకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వ హించాలని క్యాబినెట్ నిర్వహించడం బీసీలను మ రోసారి దగా చేయడమేనని బీసీ జేఏసీ రాష్ర్ట చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ రాష్ర్ట ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామ న్నారు.

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు బీసీజేఏసీ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ను నమ్మించి మోసం చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనీ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. బీసీలకు కాంగ్రె స్ ఇచ్చిన హామీలు బుట్ట దాఖలు చేస్తుంటే రాహుల్ గాంధీ కళ్లుమూసు కుంటున్నాడా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు బీసీలకు ద్రోహం తలపెడుతున్నాయని ధ్వజమెత్తారు. చట్టపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం ఇవ్వలేకపోతే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి పార్టీ గుర్తులతో జరుగుతున్న ము న్సిపల్ ఎన్నికల్లో పార్టీపరంగా జనాభా దామాషా ప్రకారం 56% టికెట్లు ఇస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోనే జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా మన్నారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ అధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ చారి, బీసీ జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్‌గౌడ్, శ్యామ్ కురుమ, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ మల్లయ్య పాల్గొన్నారు.