2 May, 2026 | 4:27 AM

ఆమిర్ తదుపరి చిత్రంలోనూ ఛాన్స్!

02-05-2026 03:11 AM

సౌత్ బ్యూటీ సాయిపల్లవి తన నటనతో అన్ని చిత్రపరిశ్రమల హీరోలను, దర్శకనిర్మాతలను మంత్రముగ్ధులను చేస్తోంది. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరు స సినిమాలు చేస్తోంది. తన సహజమైన అం దంతో అందరినీ కట్టిపడేసే ఈ భామ.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో వరుస అవకాశాలను అందుకుంటోంది.

తాజాగా ఆమెకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయిపల్లవి ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి న విష యం తెలిసిందే. ఇం దులో ఆ మిర్‌ఖాన్ కుమారుడు జు నైద్‌ఖాన్ స రసన ఆమె నటి ంచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే  సా యిపల్లవి నటనను చూసి ఆమిర్‌ఖాన్ షాక్ అయ్యారట. ఆమె పర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే, ఏకంగా తన తదుపరి చిత్రం లో ఒక శక్తిమంతమైన పాత్రను ఆఫర్ చేసినట్లు వార్త లు వస్తున్నాయి.

ఆమిర్‌ఖాన్ లాంటి స్టార్ హీరో స్వయంగా పిలిచి అవకాశం ఇచ్చారంటే, ఆమె రేంజ్ ఎంతకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆమిర్‌ఖాన్ ప్రాజెక్టే కాదు.. ఇప్పటికే సాయిపల్లవి బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మ చిత్రం ‘రామాయణం’లో సీత పాత్రను పోషిస్తోంది. రణబీర్‌కపూర్ రా ముడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సా యిపల్లవికి ఏ భాషలోనైనా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే దక్కుతున్నాయి. ఆమిర్‌ఖాన్ సినిమాలో ఆమె చేసే ఆ పవర్‌ఫుల్ రోల్ బాలీవుడ్‌లో ఆమె స్థానా న్ని మరింత పదిలం చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.