భూముల వివరాలతో నివేదికలు సమర్పించాలి
27-08-2026 07:09 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ తదితర భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. సాదాబైనామా, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణిలో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.






