27 August, 2026 | 8:29 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేయండి

27-08-2026 07:22 PM

అధికారులతో నగరపాలక కమిషనర్ 

ముకరంపుర,(విజయక్రాంతి): స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి అర్హులందరికి స్మార్టు రేషన్ కార్డులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థ అధికారులు, ఎమ్మార్వోల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, చేయుత పెన్షన్లు, ఎస్ ఐ ఆర్ ప్రక్రియ తదితర అంశాలపై  వివరాలు అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

ఎస్ ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక నోటీసు కౌంటర్ల ఏర్పాట్ల పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కళాభారతి ఆవరణలో  ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఎస్ ఐ ఆర్ నోటీసు విచారణ కౌంటర్లను సందర్శించి తనిఖీ చేసి పరిశీలించి ఆన్ లైన్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... నోటీసులు జారీ అయిన ఓటర్లు నోటీసుతో దృవీకరణ పత్రాలతో పి. ఎస్ ప్రకారం నిర్ణయించిన తేదీలలో కౌంటర్లను సంప్రదించి సర్ విచారణ ప్రక్రియను పూర్తి చేస్కోవాలని సూచించారు.

సర్ నోటీసు విచారణ ప్రక్రియకు 20 కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్ నోటీసు విచారణ కౌంటర్ల వద్ద ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని తెలిపారు.అంతే కాకుండా నగరపాలక సంస్థ పరిదిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని, చేయుత పెన్షన్ల ఆన్ లైన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేయూత పెన్షన్ల కు సంబంధించిన నూతన దరఖాస్తులను ఈనెల 31వరకు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.