7 July, 2026 | 3:38 PM

Breaking News

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •  

బిలియనీర్ల సంపదలో తగ్గుదల

17-12-2024 12:00 AM

100 బిలియన్ డాలర్ల క్లబ్‌నుంచి వైదొలగిన అదానీ, అంబానీ

 న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరులైన ముకేశ్ అంబానీ , గౌతమ్ అదానీ  సంపద తగ్గిపోయింది. వారు 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔట్ అయ్యారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. వ్యాపారపరంగా వారు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ  సంపద ఈ ఏడాది జులైలో 120.8 బిలియన్ డాలర్లు ఉండగా.. డిసెంబర్ 13 నాటికి 96.7 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. ఇక అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ  సంపద 122.3 బిలియన్ డాలర్ల నుంచి 82.1బిలియన్ డాలర్లకు తగ్గిపోయినట్లు తెలిపింది. రిలయన్స్ ఇండస్రీస్‌కు చెందిన రిటైల్, ఎనర్జీ విభాగాలు ఆశించిన మేర రాణించకపోవడంతో అంబానీ వ్యక్తిగత సంపదలో క్షీణత కనిపించింది.

ఇక అదానీ విషయానికొస్తే.. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత్‌లో పెద్దఎత్తున లంచాలు ఇచ్చారని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలపై ఇటీవల అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ వార్తలు వచ్చిన వెంటనే అదానీ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి.అంతకుముందు అమెరికా షార్ట్ స్సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  కూడా అదానీ సంస్థపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలతో షేర్లు పతనమైనా.. తర్వాత మళ్లీ పూర్వస్థితికి వచ్చింది.