12 April, 2026 | 10:52 AM

కొత్త ఫండ్ ఎంఎఫ్ లైట్

18-12-2024 12:00 AM

* నిబంధనల్ని నోటీఫై చేసిన సెబీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అధిక రిస్క్ తీసుకోదల్చిన హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల కోసం మార్కె ట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్ లైట్) పేరుతో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కోసం నియమ నిబంధనల్ని సెబీ నోటీఫై చేసింది. ఇక నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ స్పెషలైజ్డ్ ఫండ్ స్కీమ్స్‌ను ప్రారంభించుకోవచ్చు.

ఈ స్పెషల్ ఫండ్‌లో ఒక్కో ఇన్వెస్టరు కు రూ.10 లక్షల కనీస పెట్టుబడి మొత్తాన్ని నిర్దేశించింది. అలాగే ఈ స్కీమ్ ద్వారా ఆయా కంపెనీల్లో, రంగాల్లో చేసే  పెట్టుబడులకు పరిమితుల్ని విధించింది. మ్యూచువల్ ఫండ్ లైట్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి కనీసం రూ. 35 కోట్ల ఆస్తుల్లో పెట్టుబడి చేసిన నెట్‌వర్త్ ఉండాలని, వరుసగా ఐదేండ్లు లాభాల్ని తెచ్చుకున్న కంపెనీ అయితే రూ. 25 కోట్ల కనీస నెట్‌వర్త్ ఉండాలని సెబీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.