19 May, 2026 | 10:17 AM

గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు!

19-05-2026 12:00 AM

ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మెగాఫోన్ పట్టనున్నారు. జొన్నవిత్తుల దర్శకత్వంలో ‘లలిత’ అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. దీన్ని కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై పీ సుధీర్‌రాజు, డీ వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నందిని హీరోయిన్‌గా అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, తాగుబోతు రమేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంగీత ద్వయం మణి, నాగరాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే మహిళ కథగా రూపొందుతున్న ఈ సామాజిక నేపథ్య చిత్రానికి ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు...’ అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ సినిమాకు డీవోపీ: టీ సురేంద్రరెడ్డి; ఎడిటర్-: కే రమేశ్; ఆర్ట్: నాని తంగేటి; నిర్మాతలు: పీ సుధీర్ రాజు, డీ వైష్ణవి నేహా; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.