29 July, 2026 | 2:43 PM

ఉప్పొంగిన పోచ్చెర జలపాతం

29-07-2026 02:09 PM

బోథ్, జూలై 29 ( విజయక్రాంతి): మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట చేలు నీళ్లతో నిండిపోతున్నాయి. మరోవైపు వివిధ గ్రామాల సమీపంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని పో చ్చర జలపాతానికి వరద పోటెత్తింది. దీంతో జలపాతం నిండుకుండలా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వివిధ ప్రాంతాల నుండి జలపాతం సందర్శనకు పర్యటన వచ్చేందుకు ఆసక్తి సూపర్ ఉన్నారు.