29 July, 2026 | 2:42 PM

డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకర జీవితాన్ని పొందండి

29-07-2026 02:08 PM

భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ 

భూపాలపల్లి, జూలై 29 (విజయక్రాంతి): డ్రగ్స్‌కు నో చెప్పండి ఆరోగ్యకర జీవితాన్ని పొందండని భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ అన్నారు. నషాముక్త్ యువ–వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సీఐ డి. నరేష్ కుమార్ గౌడ్ హాజరై మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.