పల్లవి పాఠశాలలో ఘనంగా వినాయక నిమజ్జనం
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్, సెప్టెంబర్ 20 విజయక్రాంతి: మండల పరిధిలోని దేశాయిపల్లి చౌరస్తాలోగల (Desaipalli Crossroads) పల్లవి పాఠశాలలో (Pallavi School)వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ.వినాయక చవితి వేడుకలతో విద్యార్థుల్లో ఐకమత్యం, భక్తి,సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలమణి, సురేష్, జహీదా, సరిత, కవిత, కావేరి, చంద్రకళ, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఫొటో క్యాప్షన్: పల్లవి పాఠశాలలో వినాయకుడికి హారతి ఇస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు.