పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి

20-09-2026 | 04:11pm

సానుకూలంగా స్పందించిన బండి సంజయ్

కోహెడ, సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): కోహెడ మండలం ధర్మసాగర్ పల్లి లో(Dharmasagar Pally) ముదిరాజ్ కులస్తులు కులదైవమైన పెద్దమ్మ ఆలయం నిర్మాణం చేపట్టారు. ఆలయం కు నిధులు కేటాయించాలని.. సంఘం ప్రతినిదులు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ని(Union Minister of State for Home Affairs Bandi Sanjay) కరీంనగర్ లో కలిసి విజ్ఞప్తి చేయడంతో సంజయ్ సానుకూలంగా స్పందించినట్లు బిజెపి మండల అధ్యక్షుడు జాలిగం రమేష్  పేర్కొన్నారు. ఈ సందర్బంగా ముదిరాజ్ సంఘం నాయకులు మంత్రిని శాలువా కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం, బిజెపి యువమోర్చా మండల అధ్యక్షుడు నాగు అజయ్, బిజెపి యువమోర్చా మండల ఉపాధ్యక్షుడు కరివేద అఖిల్ రెడ్డి, జాలిగం శ్రీకాంత్ తో పాటుగా  ధర్మసాగర్ పల్లి ముదిరాజ్ సంఘం నాయకులు మాజీ ఉపసర్పంచ్ కాశావేని రమేష్, శ్రీనివాస్, ఎల్లయ్య, ఐలయ్య, లింగయ్య,  బాలయ్య, దానవేని కిట్టు, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు