దాయాదిపై అలవోకగా..
24-02-2025 12:43 AM
- పాక్‌ను చిత్తు చేసిన భారత్
- 6 వికెట్ల తేడాతో ఘనవిజయం
- సెంచరీతో మెరిసిన కోహ్లీ
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరగులకే పరిమితమైంది. ఇండియా ౪౨.౩ ఓవర్లలో ౪ వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు.




