8 July, 2026 | 10:23 PM

పెద్దసంఖ్యలో చెక్ బౌన్స్ కేసులు రాజీ కుదర్చాలి

08-07-2026 09:30 PM

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్

సిద్దిపేట క్రైం: ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ లో పెద్దసంఖ్యలో చెక్ బౌన్స్ కేసులు రాజీ కుదర్చాలని న్యాయసేవాధికారసంస్థ జిల్లా చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ మీడియా ప్రతినిధులకు సూచించారు. రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశానుసారం బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 1324 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జూలై 18 న జరిగే స్పెషల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో  ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్ కుమార్ పాల్గొన్నారు.