15 March, 2026 | 10:12 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

డబ్బు కోసం ప్రేమించే రేసర్!

05-11-2024 12:00 AM

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. డైరెక్టర్ సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. నవంబర్ 8న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నిఖిల్ రిషి అనే రేసర్ పాత్రలో కనిపించనున్నాడు.

కొన్ని లవ్‌స్టోరీలున్న రిషి.. రుక్మిణి వసంత్‌ను డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దివ్యాంశ కౌశిక్‌తోనూ మరో ప్రేమకథ ఉంటుంది. డబ్బు కోసం ఏమైనా చేయడానికి సాహసించే రిషి ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు.

రేసింగ్ నైపుణ్యంతో ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు. రిషి తరలించాలనుకున్న డెడ్ బాడీ ఎవరిది? అనే విషయాలు తెలియాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెంచేలా ఉందీ ట్రైలర్. ఈ చిత్రానికి గీత సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: సన్నీ ఎంఆర్; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్.