గ్రామీణ నేపథ్య ప్రేమకథ

25-04-2024 12:00:00 AM

ఐఐటి కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వి, రూపాలి, అంబిక, రచిత్ శివ ముఖ్యతారలుగా తెరకెక్కుతున్న చిత్రం బుధవారం లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాలిక్ శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టి.. టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ కామెడీ మూవీ ఇది.  గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో కొత్తగా, సహజంగా వుంటుంది.

తప్పకుండా మా చిత్రం జనాదరణ పొందుతుందనే విశ్వాసం వుంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ కంటెంట్ తగ్గ ఆర్టిస్టులతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మిస్తాం. ఏకధాటిగా చిత్రీకరణ జరిపి దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. జీవా, షకలక శంకర్, అంబిక, ఆమని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: తోటపల్లి సాయినాథ్, సంగీతం: .జాన్ భూషన్, పాటలు: సురేష్ గంగుల.