భారతీ లేక్‌వ్యూ పేరుతో భారీ మోసం.. ముగ్గురు అరెస్ట్
18-05-2024 02:19 PM
హైదరాబాద్: నగరంలో మరో ప్రీ-లాంచ్ ఆఫర్ మోసం వెలుగు చూసింది. భారతి లేక్ వ్యూ ప్రీలాంచ్ పేరుతో మోసాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజుతో పాటు ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాధితుల నుంచి రూ. 60 కోట్ల నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితులు 350 పైగా ఉన్నారని పోలీసులు విచారణలో తేల్చారు. కొంపల్లిలో భారతీ లేక్‌వ్యూ ప్రీ-లాంట్ పేరుతో భారీగా వసూళ్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.






