calender_icon.png 12 November, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయంతి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

19-05-2024 02:19:01 AM

యాదాద్రిభువనగిరి, మే 18 (విజయక్రాంతి): భక్తజన బాంధవుడిగా.. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న స్వయంభూ యాదా ద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సన్నిధిలో ఈ నెల 20నుంచి మూ డు రోజుల పాటు నిర్వహించే నృసిం హ జయంత్యుత్సవాలకు ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు తెలిపారు. శనివారం కొండపై అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనర్సింహచార్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడా రు.

వేసవి ఎండలు కొట్టినా, అకాల వర్షాలు కురిసినా ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికా రులు, సిబ్బం ది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ఉత్సవాల్లో జరిగే మూడు రోజులు అలంకార సేవలు, కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, సహస్ర కలశ అభిషేకం, శాస్త్ర పద్ధతిన వైభవంగా జరుపనున్నట్టు తెలిపారు. ప్రభంద పారాయణాలు, మూల మంత్ర జపాలతో పాటు హోమాలు, పూర్ణాహుతి వైధిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయ న్నారు. 23న సాయంత్రం సంద్యసమయాన నృసింహ ఆవిర్భావ వేడుక లు ఘనంగా జరుగుతాయన్నారు. మూడు రోజుల పాటు భక్తులను అలరింపచేయడానికి భక్తి సంగీతం, భజనలు, భరత నాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.