14 May, 2026 | 1:41 AM

విద్యావ్యవస్థకు పరీక్షా సమయం

14-05-2026 12:00 AM

డి.జె మోహనరావు :

* ఇప్పుడు చేయాల్సింది మళ్లీ పరీక్ష నిర్వహించడం మాత్రమే కాదు. ముందుగా విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి నిర్మించాలి. తప్పు ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విచారణలు పారదర్శకంగా జరగాలి. 

నీట్ ప్రశ్నాపత్రం లీక్ అనేది ఈ పరీక్ష రాసిన విద్యార్థుల గుండెల్లో దిగి న బాకు మాత్రమే కాదు, లక్షలాది జీవితా ల్లో ఒక్కసారిగా వెలుగు ఆరిపోవడం లాంటి ది కూడా. నెలల తరబడి కాదు, ఏళ్లుగా నిద్ర మానేసి, ఫోన్లు దూరం పెట్టి, పండుగలు వదిలేసి, తమ యౌవనాన్ని ప్రశ్నాపత్రాల మధ్య బంధించిన పిల్లలకు పరీక్ష రద్దు అనే రెండు మాటలు వార్తలా వినిపించవు. అవి గుండెలమీద పడే బరువులా అనిపిస్తాయి.

పాపం, పుణ్యం తెలియకుండా కష్టాన్ని మా త్రమే నమ్ముకొని ఈసారి బాగా రాశామని, మంచి ర్యాంకు వస్తుందని ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఇప్పుడు మళ్లీ సందిగ్ధంలో పడ్డారు. విద్యార్థుల కంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతు న్నారు. పైసా పైసా కూడబెట్టి పిల్లలను చదివించారు. కొందరు బంగారం అమ్మారు. మరికొందరు పొలాలు తాకట్టు పెట్టారు.

ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల్లో డాక్టర్ అవ్వాలనే కల ఒక వృత్తిపై ఆశ మా త్రమే కాదు. అది ఒక తరాన్నే మార్చే ఆశ యం. ఇప్పుడు వారిని వెంటాడుతున్నది పరీక్ష రద్దయిందనే బాధ మాత్రమే కాదు, మళ్లీ అదే స్థాయిలో రాయగలమా? అనే భ యం కూడా. ఒక పరీక్షను మళ్లీ నిర్వహించడం సాధ్యమే కావచ్చు. కానీ, ఒకసారి విరి గిపోయిన మనసును తిరిగి అదే ధైర్యంతో నిలబెట్టడం అంత సులభం కాదు.

పేపర్ లీక్ అయిందని, నిర్వహణలో లో పాలు జరిగాయని, అవకతవకలపై అనుమానాలు వచ్చాయని అధికారిక కారణాలు విని పించవచ్చు. కానీ, ఇక్కడ అసలు ప్రశ్న ఇం కొకటి ఉంది. దేశంలో అత్యంత కీలకమైన పరీక్షలలో ఒకటైన నీట్‌ను కూడా నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించలేకపోతే వి ద్యార్థులు ఇంకేం నమ్మాలి? పరీక్షల మీద నమ్మకం కూలిపోవడమనేది కేవలం విద్యావ్యవస్థ సమస్య కాదు. అది సమాజ నైతికత కదలిపోతున్నదని చెప్పడానికి సంకేతం.

ఎందుకంటే పరీక్షలు కేవలం మార్కులు ఇ వ్వవు. నువ్వు కష్టపడితే ముందుకు వెళ్లగలవనే విశ్వాసాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు అ దే విశ్వాసం ముక్కలవుతోంది. దేశవ్యాప్తం గా ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు నీట్ రాస్తున్నారు. వారిలో చాలా మంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే. వాళ్లకు ప్రతిభ ఒక్కటే మూలధనం.

కానీ, ఇప్పుడు ఎక్కడో, ఎవరో వ్యవస్థను మోసం చేస్తే తన కష్టం వృథా అవుతుందా? అనే భయం పెరుగుతోంది. ఇది ఏ విద్యార్థికైనా అత్యంత ప్రమాదకరమైన మానసిక స్థి తి. ఎందుకంటే ఆశ కోల్పోయిన యువత ఇ చ్చే నిశ్శబ్దం కన్నా భయంకరమైనది మరొకటి ఉండదు.

ఒకే పరీక్షతో జీవితాన్ని కొలవచ్చా?

నీట్ చుట్టూ ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న నిలుస్తోంది. కోట్లాది విద్యార్థుల భవిష్యత్తును ఒకే రోజు, ఒకే పరీక్షతో నిర్ణయించడం నిజంగా న్యాయమేనా? ఒక గ్రామంలో తె లుగు మీడియంలో చదివిన విద్యార్థి, అత్యం త ఖరీదైన కోచింగ్ తీసుకున్న నగర విద్యార్థితో ఒకేస్థాయిలో పోటీ పడుతున్నాడని చెప్పడం సులభం. కానీ, వాస్తవ పరిస్థితులు అంత సమానంగా లేవు. ఒకరికి టెస్ట్ సిరీస్‌లు, ప్రత్యేక శిక్షణ, డిజిటల్ సదుపాయా లు ఉంటే, మరొకరికి కనీసం సరైన విద్యుత్ సదుపాయం కూడా ఉండకపోవచ్చు.

అయినా ఇద్దరికీ ఒకే మెరిట్ కొలమానం వర్తింపజేయడం నిజంగా సమానత్వమేనా? మెరిట్ అనే పదం వినడానికి గొప్పగా ఉంటుంది. కానీ ఆ మెరిట్ వెనుక కుటుంబ పరిస్థితి ఏమిటి? ఆర్థిక స్థితి ఏమిటి? అవకాశాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? అ నే ప్రశ్నలూ ఉంటాయి. కొందరు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లలో లక్షలు ఖర్చు చేసి సిద్ధమవుతుంటే, మరికొందరు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వనరుల మధ్య చదువుతు న్నారు. పరీక్ష అందరికీ ఒకటే కావచ్చు. కానీ, అవకాశాలు మాత్రం అందరికీ ఒకేలా లేవు.

నలిగిపోతున్న విద్యార్థులు

నీట్ వంటి పరీక్షలు వచ్చిన తర్వాత విద్య అంటే జ్ఞానం అనే భావన క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పుడు చాలామంది విద్యా ర్థులు పాఠాన్ని అర్థం చేసుకోవడానికి కాదు, ప్రశ్నకు సరైన సమాధానం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చదువుతున్నారు. పాఠశా లలు విద్య నేర్పే స్థలాలుగా కాకుండా, పరీక్షలకు సిద్ధం చేసే గదులుగా మారిపోతున్నా యనే విమర్శలు పెరుగుతున్నాయి. కోట్ల రూపాయల కోచింగ్ పరిశ్రమ విద్యార్థుల ఆశలను మాత్రమే కాదు, వారి భయాలను కూడా వ్యాపారంగా మార్చేసింది.

ఉదయం నుంచి రాత్రి వరకు టెస్టులు, ర్యాంకులు, పోలికలు, ఒత్తిళ్లు... ఇవన్నీ కలిసి విద్యార్థి బాల్యాన్ని మెల్లగా మింగేస్తున్నాయి. డాక్టర్ కావాలనే కల ఇప్పుడు చాలామందికి సేవాభావం కంటే బతుకుపోరాటంగా మారిపో యింది. ఈ వ్యవస్థలో పిల్లలు చదువుకుం టూ పెరగడం లేదు. కేవలం ఒత్తిడి మధ్య పెద్దవాళ్లు అవుతున్నారు.

కనిపించని మానసిక యుద్ధం

నీట్ గురించి మాట్లాడేటప్పుడు మనం మార్కులు, ర్యాంకులు, సీట్ల గురించి ఎక్కువగా మాట్లాడతాం. కానీ, విద్యార్థుల మాన సిక ఆరోగ్యం గురించి చాలా తక్కువగా చర్చిస్తాం. ఒక విద్యార్థి సంవత్సరాల కష్టం ఒక్క పరీక్షపై ఆధారపడినప్పుడు, అతని మనసులో భయం కలగడం సహజం. ‘ఫలితం రాకపోతే నా విలువ ఏమిటి?’ అనే ప్ర శ్న చాలామంది పిల్లల్ని కుంగదీస్తోంది. బ యటికి కనిపించేది చదువు మాత్రమే.

కానీ వారు తమ మనస్సులలో ఒంటరితనం, ఆందోళన, నిరాశతో కూడిన యుద్ధం చేస్తున్నారు. పరీక్ష రద్దు వార్త వచ్చిన క్షణంలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు. కొందరు ఏడ్చి ఉండొచ్చు. కానీ, ఇంకా ప్రమాదకరమైన స్పందన మరొకటి ఉంది. అది నిశ్శబ్దం. ఎందుకంటే చాలామంది పిల్ల లు ఇప్పుడు అలసిపోయారు; కేవలం చదువుతో కాదు, నిరంతర ఒత్తిడితో.

రీ-ఎగ్జామ్ మాత్రమే కాదు

ఇప్పుడు చేయాల్సింది మళ్లీ పరీక్ష నిర్వహించడం మాత్రమే కాదు. ముందుగా విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి నిర్మించాలి. తప్పు ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విచారణలు పారదర్శకంగా జరగాలి. ఎందుకంటే రహస్యంగా జరిగే విచారణలు అనుమానాలను మరింత పెంచుతాయి. పరీక్షా నిర్వహ ణ వ్యవస్థను సాంకేతికంగా మరింత భద్రం గా మార్చాలి. ప్రశ్నాపత్రాల రవాణా నుంచి పర్యవేక్షణ వరకు ప్రతి దశలో డిజిటల్ ట్రాకింగ్ ఉండాలి.

అంతకంటే ముఖ్యంగా, ఒకే పరీక్షతో జీవితాన్ని నిర్ణయించే విధానం గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ప్రారంభం కావాలి. స్కూల్ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలా? బహుళ దశల మూల్యాంకనం అవసరమా? రాష్ట్ర విద్యావ్యవస్థల పాత్ర పెరగాలా? అనే ప్రశ్నలపైనా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక మద్దతు, స్థానిక భాషల్లో నాణ్యమైన వనరులు అందుబాటులోకి రావాలి. అలాగే ప్రతి కీలక పరీక్ష తర్వాత విద్యార్థులకు, తల్లిదండ్రులకు మానసిక కౌన్సెలింగ్ సపోర్ట్ కూ డా అవసరం. ఎందుకంటే పిల్లలు విఫలమవుతున్నది చదువులో కాదు, ఒత్తిడిని ఒం టరిగా మోయడంలో.

పరీక్షలు భవిష్యత్తును నిర్మిస్తున్నాయా?

ఈ దేశ భవిష్యత్తు పరీక్షా హాళ్లలో కూర్చు న్న ఆ పిల్లల చేతుల్లోనే ఉంది. వాళ్లు ప్రశ్నపత్రాలకు సమాధానాలే రాయడం లేదు, త మ జీవితాన్ని రాస్తున్నారు. అలాంటి సమయంలో వ్యవస్థ వాళ్లకు కనీస న్యాయం కూ డా ఇవ్వలేకపోతే, అది పాలనా వైఫల్యమే కా దు, సమాజంగా మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన క్షణం. ఎందుకంటే ఒక పరీక్షను మళ్లీ నిర్వహించడం సాధ్యమే. కానీ, ఒక త రం మనసులో విరిగిపోయిన నమ్మకాన్ని మళ్లీ నిర్మించడం చాలా కష్టం.