సంక్షోభానికి ‘పొదుపు’ సంకేతమా?
ప్రొ. సంగని మల్లేశ్వర్ :
ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఓ అ సాధారణమైన, ప్రత్యక్ష పిలుపునిచ్చారు. ఇది ఓట్ల కోసమో, ప్రభుత్వ పథకం కోసమో కాదు సుమా? రాజకీయాలకు పోకుండా దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి దైనందిన అలవాట్లలో మార్చుకోసం ఆయ న పిలుపునిచ్చారు. గుజరాత్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని, 20 గం టల వ్యవధిలో రెండోసారి ఇంధన పొదుపు ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంత ర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు 140 కోట్ల మంది భారతీయులు కలిసిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారంటే ఆర్థిక సంక్షోభం మోదీ సర్కార్‌ను వేధిస్తున్నట్లు అనిపించక మానదు. స్వాతంత్య్రానంతరం మన దేశం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా, వాటిని ఆర్థిక సంక్షోభాలుగా పరిగణించలేదు.
ఈ నేపథ్యంలో ఈసారి ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందా? అనే ప్ర శ్న అందరిలో మెదులుతుంది. ఎప్పుడు సనాతన ధర్మం, హిందూ సంస్కృతి గురిం చి వల్లెవేసే మోదీ, తెలంగాణ గడ్డమీద పొ దుపు ప్రవచనాలు చెప్పడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఆషామాషీగా ఓ బడ్జెట్ ప్రకటనలాగానో, కొత్త పా లసీలాగానో చెప్పలేదు,
దేశం ప్రస్తుతం యుద్ధం చేయకపోయినా.. దాని పర్యవసానాలకు ఈ రకంగా మూల్యం చెల్లిస్తోందని, ఈ పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ ఒక ‘ఆర్థిక సైనికుడి’లా వ్యవహరించాలని కోరడం 140 కోట్ల మంది ప్రజలపై భారం మోపినట్టు కనిపించింది. ఇరాన్ ,అమెరికా యు ద్ధం, ప్రపంచ సంక్షోభ సమయంలో కొన్ని ప్రత్యేక అభ్యర్థనలను దేశ ప్రజల ముందుంచడం ఏదో కీడు శంకిస్తోంది.
భగభగ మండే ఎండల్లో మోదీ రాక సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఊరూరా జనసమీకరణ చేసి పరేడ్ గ్రౌండ్‌కు వచ్చారు. అయితే, రాజకీయాలు, విలువలు, సంప్రదాయాలు అంటూ ప్రస్తావించే ప్రధాని స్వ యం సమృద్ధ భారత్‌కు తెలంగాణ పర్యటనలో పది సూత్రాలు విడుదల చేసి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పకనే చెప్పారు. ఇక దేశభక్తి చూపించాల్సిన సమ యం వచ్చిందని అన్నారు. విదేశాల నుంచి దిగుమతులు పరిమితం చేయాలన్న మోదీ.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని సూచించారు.
మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించాలని, కరోనా కాలం నాటి క్రమశిక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. సొంత కార్లు ఉన్నవారు కార్‌పూ లింగ్‌ను ప్రోత్సహించాలని హితోపదేశం చేశారు. అంతేకాదు, రైతును రాజును చేస్తానన్న మోదీ.. ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పారే గానీ, సరైన ప్రత్యామ్నాయం చూపెట్టలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహించాలన్న ప్రతిపాదన కూడా చేశారు.
ఈ చిన్నచిన్న మార్పుల ద్వారా ప్రతి ఒక్కరూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వాములు కావచ్చని ప్రధాని పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పాటించాలన్న మోదీ ఏడాది వరకు బంగారం కొన వద్దంటూ ఆసక్తికర సూచన చేశారు. అయితే, ఆయన సూచనపై బులియన్ మా ర్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మోదీ పైకి గంభీరంగా వికసిత్ భారత్ గురించి చెప్తున్నప్పటికీ, పొదుపు మంత్రాన్ని చూస్తుంటే మాత్రం 1991 నాటి ఆర్థిక సంక్షోభం గుర్తుకువస్తోంది. నాటి స్థితిగతు లు పునరావృతం అవుతాయా? అసలు ఈ సూచనల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి.
ప్రధాని మోదీ ఈ విజ్ఞప్తి చేయడానికి బలమైన ఆర్థిక కారణాలున్నాయి. ముడిచమురు వినియోగంలో, దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశం. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో భారత ముడిచమురు దిగుమతులు 88 శాతానికి చేరాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయానికి ఇది 87.6 శాతంగా ఉండేది. దేశీయంగా ఉత్పత్తి నిలకడగా ఉండగా, డిమాండ్ మాత్రం భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణం.
దిగుమతుల కోసం వెచ్చిస్తున్న విదేశీ మారకద్రవ్యం కూడా ఆందోళనకరంగా మారింది. మనకు పెద్ద చమురు బావులు లేవు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు విపరీతంగా పెరిగినందున, ఇంధనాన్ని పొదుపు చేసి, దానికోసం వెచ్చిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పడం వెనుక దురుద్దేశం లేకపోయినప్పటికీ, భారత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి.
చమురు సంస్థలు రోజుకు రూ.2,400 కోట్లు నష్టపోతున్నా, ముడిచమురు ధరలు 50 శాతం మేర పెరిగినప్పటికీ తమ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, రిటైల్ ధరలను యథాతధంగా కొనసాగిస్తుందని బీజేపీ చెప్పింది. కానీ, నేటి పరిస్థి తులను చూస్తుంటే ఎన్నికలయ్యాక ధరలు పెరుగుతాయని విపక్షాలు చెప్పిన మాట నిజమయ్యేట్టు కనిపిస్తోంది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకలు నేడు ఎదుర్కొంటున్న దుస్థితిని ఒకసారి గమనిస్తే.. అవి పాలకుల వైఫల్యమే. భారత్ ఆ స్థాయికి వెళ్లకుండా ఉండాలంటే, ముందుస్తు జాగ్రత్తగా ప్రధాని చేసిన ఈ విజ్ఞప్తులు తన నుంచే ప్రారంభం కావాలి.
పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే
ప్రధానిమోదీ తన దౌత్య నీతితో ప్రపంచపటంలో భారత కీర్తిని ఇనుమడింపజే శారని, అంతర్జాతీయ వేదికపై భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలిపారని బీజేపీ నేతలు చెప్తుంటారు. విదేశీ టూర్లను తగ్గించుకోవాలన్న మోదీ తన పన్నెండేళ్ల పాలనా కాలం లో 79 దేశాల్లో 99 సార్లు పర్యటించారు. తెలంగాణ నడిబొడ్డున మాట్లాడిన పొదుపు మంత్రం మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని తలపించింది.
మండుటెండల్లో రాష్ట్ర బీజేపీ వ్యయ ప్రయాసలకోర్చి సభ నిర్వహిస్తే ఇంధన వినియోగం తగ్గించాలని, ఏడాది పాటు బంగా రం కొనుగోలు ఆపాలని చెప్పుకొచ్చారు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగినప్పుడూ స్పందించని మోదీ, అకస్మాత్తుగా ఈ సూచన చేయడం వెనుక ఆర్థిక సంక్షో భం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గతేడాది ముడిచమురు, బంగారం, వంటనూనెలు, ఎరువుల దిగుమతులకే భారత్ రూ.23 లక్షల కోట్ల ఖర్చు చేసింది.
మొత్తం దేశం దిగుమతుల కోసం రూ.74 లక్షల కోట్లు వెచ్చించిందని గణాంకాలు చెపుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే మన దగ్గర ఉన్న నిల్వలకు తొమ్మిది నెలలపాటు ఢోకా లేదు. కానీ, విదేశీ మారకద్రవ్య నిల్వ ల కొరత వల్ల ధరల నియంత్రణ పట్టుతప్పుతుందేమోనన్న అనుమానం లేకపో లేదు. మోదీ కోరుకున్న విధంగా 140 కోట్ల ప్రజ లు నడవాలంటే తొలుత ఆయన విదేశీ ప్ర యాణాలు, రవాణా, సూట్, బూట్ల దుబా రా ఖర్చు తగ్గించాలని చెప్పక తప్పదు.
వ్యాసకర్త:
కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి,
9866255355






