9 June, 2026 | 2:48 AM

అందాల నిధి

28-08-2024 12:15 AM

శ్రీసింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేశ్ రానా దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘మత్తు వదలరా’. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘మత్తు వదలారా2’ చిత్రాన్ని చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాత్ర ‘నిధి’ని పరిచయం చేస్తూ మేకర్స్ మంగళవారం ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఫరియా.. గన్ పట్టుకొని ఉన్న యాక్షన్ స్టిల్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ; సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగం.