calender_icon.png 20 July, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతను ఆకట్టుకునే ఈసారైనా గీతం

28-08-2024 12:17:39 AM

విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘ఈసారైనా’. అశ్విని అయలూరు ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూనే, అతని ప్రేమను వెతుక్కునే దిశగా సాగే ఈ సినిమాలోని మొదటి పాట ఇటీవల విడుదలైంది. రాకేం దు మౌళి రాసిన సాహిత్యం, అర్జున్ విజయ్ గానం యువత నోట ప్రతిధ్వనిస్తోంది. ఇంకా ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్ తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: తేజ్; సాహిత్యం: గోరటి వెంకన్న, రాకేందు మౌళి, శర త్ చేపూరి; డీవోపీ: గిరి.