9 August, 2026 | 4:53 PM

ఈ నెల 13న చలో జిల్లా కలెక్టర్

09-08-2026 03:42 PM

నిర్మల్, ఆగస్టు 8 (విజయక్రాంతి): అర్హులైన బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయూత పథకం ద్వారా జీవన భృతి అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న  డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గల భగత్ సింగ్ భవన్లో ఆదివారం రోజున తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం లో పాల్గొన్నారు . మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4016రూపాయల జీవన భృతిఅమలు చేస్తామని హామీ ఇచ్చారు.

హామీని మరిచి బీడీ కార్మికులకు జీవన భృతి దరఖాస్తులు తీసుకపో తీసుకోకపోవడం, బీడీ కార్మికుల పై వివక్షత చూపుతున్నారని,ప్రకటించిన విధంగా వెంటనే బీడీ కార్మికుల దరఖాస్తులు తీసుకొని జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13వ తేదీన నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న. జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రామ లక్ష్మణ్. జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ గంగన్న. జిల్లా కోశాధికారి ఎండిగపూర్. జిల్లా నాయకురాలు లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.