7 September, 2026 | 5:18 AM

మనసెరిగిన కవి

07-09-2026 | 04:00am

ఆత్రేయతో సినిమా పాటల, మాట ల సంప్రదాయ రచనా శైలి (Traditional writing style) మారింది. ఆయన కలం కొత్త పుంతలు తొక్కింది. బెంగాళీ, హిందీ చిత్రాలలో నూతన శైలి ఆవిష్కృతమవుతున్న తరుణంల నాటక రచనల్లో ప్రసిద్ధుడైన ఆత్రే య తెలుగు సినిమా రచన చేపట్టారు. కథ, కథనం, మాటల రచనపై గొప్పగా అధ్యయనం చేశారు. నాటకాల్లోలాగా డైలాగుల ను పెద్దగా రాయడం సినిమా రచనకు కుదురదు. భావగర్భితంగా... పాత్రోచితం గా సరళమైన పదాలతో చిన్నగా రాయ టం...

అభినయానికి ఆస్కారంగా గొప్పగా పలికే విధంగా డైలాగ్ ఉండాలన్నది ఆయ న గ్రహించారు. ఇదే ఒరవడిని సినిమా రచనలో కొనసాగించి సినిమా రచయిత ల్లో అగ్రగణ్యుడయ్యారు. ఆయన సినిమా రచయితగా కొనసాగుతున్న సమయంలో టాప్ స్టార్ హీరో అక్కినేని, అలాగే స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు, (అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ కాంబినేషన్‌కు... అ.ఆ.ఆ. అనే ప్రఖ్యాతి ఉండేది), స్టార్ గాయకుడు ఘంటసాల కలయిక తోడవ్వడం నలుగురి టీం ప్రభంజనమైంది. వారు పని చేసిన చిత్రాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఈ క్రమంలో పలువురు నిర్మాతలు ఆత్రేయతో తమ సినిమాలకు మాటలు, పాటలు రాయించుకోడానికి ఎగబడేవారు. దీంతో అప్పుడప్పుడు ఆయనకు రాయడం ఆలస్యమయ్యేది. ఇందుకు ఆత్రే య... సమయానికి రాయక నిర్మాతలను ఏడిపిస్తే, రాసి ప్రేక్షకులను ఏడిపించే వాడని సినిమా ఇండస్ట్రీలో ప్రచారం ఉండేది. కాగా ఎన్ని సినిమాలకు రాసింది ఆయనకే తెలియదట. అయితే దాదాపు 400 సినిమాలకు రాసినట్లు చెబుతారు.

మనసుకు ప్రాధాన్యమిచ్చి పాటలు రాయ టం ఆయన నేర్పుగా చెబుతారు. అందుకే ఆయన్నూ ‘మనసు కవి’గా గొప్పగా పిలిచారు. కాగా ఆత్రేయలో బహుళ భావ జాలాలున్నాయి. ఒకే భావజాలానికి పరిమితం కాకుండా ఏ సబ్జెక్టు ఇచ్చినా అల వోకగా రాసి న్యాయం చేకూర్చే ప్రతిభ ఆత్రేయ సొంతం. ప్రేమ, శృంగారం, విర హం, ఆవేదన, ఆనందం, ఆవేశం, ఉద్రేకం, విప్లవం, అభ్యుదయం, భక్తి, సరదా, హాస్యం పరిహాసంపై కమర్సియల్‌గా రాసే నేర్పు, ప్రతిభ ఆత్రేయలో కనిపిస్తుంది.

ఆత్రేయ ఎన్ని రకాల పాటలు రాసినా... భగ్న ప్రేమికుల పాటలు ఆయనను ఆకాశానికెత్తాయి. అందుకు ఉదహరణలుగా ‘ప్రేమనగర్’లో ‘మనసు గతి ఇంతే, ఎవరి కోసం ఈ ప్రేమమందిరం’, ‘ప్రేమలు పెళ్లిల్లు’లోని ‘మనసు లేని దేవుడు మనిషికెం దుకు మనసిచ్చాడు’ లాంటి ఎన్నో పాట లు మనకు కనిపిస్తాయి. ఇక ‘తోడి కోడళ్లు’లోని ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దానా’ పాటలో శ్రీశ్రీగా కనిపిస్తారు. ఆ పాటను ఆత్రేయ రాశారంటే మొదట్లో చాలామంది నమ్మేవారు కాదు.

దటీజ్ ఆత్రేయ. కుర్రకారులో మత్తు నింపి హుశారుతో ఉరక లెత్తే ఎన్నో పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘దసరా బుల్లోడు’లోని ‘పచ్చ గడ్డికోసేటి పడుచు పిల్లా’, ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’, ‘బంగా రు బాబు’లోని ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’, ‘ఆత్మ బలం’లోని ‘చిటపట చినుకులు’ తదితర ఎన్నో పాటలున్నాయి. అలాగే ‘బడి పంతులు’లోని ‘భారత మాతకు జేజేలు’ దేశభక్తి పాటలో.... ఆత్రేయలో మహాకవులు రవీంద్రనాథ్ ఠాగూ ర్, బంకించంద్ర ఛటర్జీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి కనిపిస్తారు.

‘మంచి మనసులు’లోని ‘అహెూ ఆంధ్రభోజా శ్రీకృష్ణ దేవరాయా’ పాటలో మనల్ని శ్రీకృష్ణ దేవరాయలవారి కాలానికి తీసుకువెళ్లే చరిత్రకారుడిగా, విజయనగర కళావైభవ మహా శిల్పిగా ఆత్రే య కనువిందు చేస్తారు. ‘మూగ మనసులు’లోని ‘ముద్ద బంతి పూవులో’, ‘పాడు తా తీయగా’ పాటలతో మూగప్రేమనూ, ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాటతో మహా ప్రేమికుడి గొప్ప ప్రేమనూ చాటుతారు. ఇంకా ‘బంగారు బొమ్మలు’, ‘ఆస్తిప రులు’ తదితర చిత్రాల్లోని ప్రేమ పాటలు ప్రేమికులను ప్రణయ లోకాల్లో విహరింపజేస్తాయి.

ఇక భక్తి పాటలు రాయడంలో కూడా మేటి అనిపించుకున్నారు. ‘భక్త తుకారాం’లో ‘ఉన్నావా?...అసలున్నా వా?’, ‘షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’లో ‘మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా’ ఇలా అనేక పాటలతో భక్తులను పారవశ్యంలో ముంచారు. ఇం కా ఆయన రాసిన వేలాది పాటల్లో ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. ఆయన రాసిన పాటల్లో 90 శాతం ఘంటసాల పాడినవే. అగ్ర హీరో అక్కినేని అభినయించినవే. ఇలా ఆత్రేయ పాటలు అజరామరంగా నిలిచి ఎన్ని తరా లు మారినా అవి ఎప్పు డూ ప్రజల్లో మారుమోగుతూనే ఉన్నాయి. 

ఆత్రేయ సహజమైన నిలువెత్తు నిఘంటువు. కొందరు కవుల్లా ఆయన నిఘం టువులోని పదాలను ఏరుకొని పాటలు రాయరు. అదికాకుండా గ్రాంథిక పదాలు వాడరు. పెద్దపెద్ద వాక్యాలూ రాయరు. సరళమైన పదాలతో చిన్నగా, నీటుగా, వినసొంపుగా రాశారు. ఆయన ఎక్కువగా సాంఘిక చిత్రాలకు కథ, మాటలు, పాట లు, రాశారు. అయితే పౌరాణిక ప్రఖ్యాత చిత్రం ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాకు గొప్పగా మాటలు రాసి తన బహు ముఖ ప్రజ్ఞను చాటారు.


 తాళ్లపల్లి యాదగిరిగౌడ్

9949789939

మరిన్ని వార్తలు