05-12-2025 12:34:29 AM
మేడిపల్లి, నవంబర్ 4 (విజయక్రాంతి): తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని, ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా పోచంపల్లికి చెందిన సాయి ఈశ్వర్ (35)కు భార్య కవిత(30), ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జగద్గిరిగుట్ట ముగ్ధంనగర్‌లో నివసిస్తున్నారు.
గురువారం సాయంత్రం సాయి రాష్ట్రంలో, బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా, మోసం చేసిందని, దీనిపై తీన్మార్ మల్లన్న పోరాటం చేయాలని, క్యూ న్యూస్ ఆఫీసుకి వెళ్లాడు. మల్లన్న ఆఫీసులో లేరని చెప్పడంతో కిందికి వచ్చి క్యూ న్యూస్ కార్యాల యం ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు, ఫైర్ ఇంజన్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి గాంధీ ఆస్పత్రికి తరలించారు.