calender_icon.png 5 December, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పొటీలకు జిల్లా విద్యార్థి

05-12-2025 12:36:14 AM

మంచిర్యాల టౌన్, డిసెంబర్ 4: రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండ ర్ - 19 ఖోఖో పోటీ లకు జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న గురువారం తెలి పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల మోడ ల్ స్కూల్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వై నందిని ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని వెస్లీ జూనియర్ కాలేజ్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటుందన్నారు.

నందినిని మంచిర్యాల డీఐఈఓ అంజయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ కళాశాల క్రీడల సమాఖ్య కార్యదర్శి బి బాబురావు, మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పీడీ సుదీప్, అధ్యాపక బృందం అభినందించారు.