యువతి కనబడుటలేదు
అశ్వారావుపేట (విజయక్రాంతి): 21 ఏళ్ల యువతి సెప్టెంబర్ 14వ తేదీ నుండి కనపడటం లేదని తన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ యయాతిరాజు(SI Yayatiraju) తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో రామన్నపాలెం కాలనీకి చెందిన 21 ఏళ్ళ యువతి పోడియం నందిని హైదరాబాదులో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె తల్లితో కలిసి ఆగస్టు 30న స్వగ్రామం వచ్చింది.
తల్లి మల్లేశ్వరి తిరిగి హైదరాబాద్ వెళ్ళగా.. వారం రోజుల తర్వాత ఈనెల 14న నందిని పిన్ని అశ్వరావుపేట బస్టాండ్లో హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించింది. నందిని గమ్యం చేరలేదు. దీనిపై అదృశ్యమైన యువత తల్లి మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు ఎస్సై యయాతి రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు ఎస్సై ఫోన్ నెంబర్: 8712682062కు సమాచారము ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.