25 March, 2026 | 5:55 PM

Breaking News

మరో రెండు రోజులు వర్షాలు

25-07-2024 01:46 AM

పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా రాష్ట్రం లోఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేం ద్రం అధికారులు తెలిపారు. ఈ మేర కు వారు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బుధవారం నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లా ల్లో  భారీ వర్షపాతం నమోదు కాగా.. వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్ల గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లలో మోస్తరు వర్షాలు కురిశాయి.