అసెంబ్లీ ముట్టడి పోస్టర్ల ఆవిష్కరణ
25-03-2026 04:30 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 26న ఆద్మీ అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. బుధవారం అసెంబ్లీ ముట్టడి పోస్టర్లను ఆవిష్కరించారు. నిరుద్యోగులందరూ ఈ ముట్టడి కార్యక్రమం పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ రాజేశ్వర్ మైముద్ రైతులు పాల్గొన్నారు




