17 April, 2026 | 9:41 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

జిల్లాలో 5 ఎకరాల పంట నష్టం

27-02-2026 05:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజుల్లో కురిసిన వడగళ్ల వాన బలమైన గాలుల వల్ల పంట నష్టం వివరాలు అంచనా వేయడం జరిగిందన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

ముఖ్యంగా మక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పంట పొలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను యుద్ధ ప్రతిపాదికన సిద్ధం చేయాలని ఆమె సూచించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.