చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన దావస్వాతి
- చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా దావ స్వాతి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పదవి బాధ్యతలు స్వీకరించిన దావస్వాతి, వైస్ చైర్మన్ సత్యనారాయణ ను పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ దావస్వాతి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగం శెట్టి సతీష్ లను సన్మానించారు.
పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ దావ స్వాతి మాట్లాడారు. అభివృద్ధిలో బెల్లంపల్లిని ఆదర్శంగా నిలబెడతామని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.
రాజకీయాలకతీతంగా కౌన్సిల్ సభ్యులం కలిసికట్టుగా పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎంతో నమ్మకంతో గెలిపించిన పట్టణ ప్రజలకు ఎల్లకాలం రుణపడి ఉంటామన్నారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.
నిస్వార్ధంగా పనిచేయండి..
ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పట్టకట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ప్రజల నమ్మకాలను మమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు ఏం అవసరం వాటిని గుర్తించి తీర్చాలని కోరారు. నిధులపరంగా పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సభ్యులను చేసుకోవాలన్నారు. నిస్వార్ధంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మేలు చేయాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు ముచ్చర్లమల్లయ్య, నాతరీ స్వామి, కటకం సతీష్ తదితరులు పాల్గొన్నారు.






