7 August, 2026 | 2:34 AM

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

07-08-2026 01:44 AM

ప్రజల సంక్షేమమే ప్రజాపాలన అంతిమ లక్ష్యం

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

అడ్డాకుల ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సమస్యలను పక్కన పెట్టకూడదని ప్రతి పరిష్కార రూపం చూపించాలని ఆదేశించారు.

సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారి దగ్గరికి వెళ్లి పరిష్కరించాలని సూచించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.