13 July, 2026 | 5:06 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్య తీసుకోవాలి

13-07-2026 03:52 PM

ఖానాపూర్ ( విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన యాదవుల పెద్దమ్మ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారిపై అవమానకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చర్య తీసుకోవాలని నిర్మల్ టిఆర్ఎస్ కౌన్సిలర్ యాదవ సంఘం జిల్లా బాధ్యులు శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. తక్షణమే తన వ్యాఖ్యలను బహిరంగంగా ఉపసంహరించుకుని, శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్  మాత్రమే కాకుండా యాదవ సమాజం మొత్తం పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా యాదవ్ సంఘం తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము.

యాదవ సమాజ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలకు వెంటనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి, యాదవ సమాజం ఐక్యతను చాటుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.