calender_icon.png 15 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొరచేప దాడిలో నటుడు మృతి

25-06-2024 12:05:00 AM

తమయో పెర్రీ.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన పేరు పొందిన నటుడు. ఆయన ఆదివారం హవాయి ఓహు ఉత్తర తీరంలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఓ సొరచేప ఆయనపై దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన తమయో పెర్రీ (49) తీవ్ర గాయా ల పాలయ్యాడు. మలేకహనా బీచ్‌లో పెర్రీ అచేతనంగా పడిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అతన్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ‘పైరేట్ ఆఫ్ ది కరేబియన్’లో ఆయన నటనకు గుర్తింపు వచ్చింది. పెర్రీ లైఫ్ గార్డ్ మాత్రమే కాక ప్రొఫెషనల్ సర్ఫర్ కూడా. స్థానిక ఓసియన్ సేఫ్టీ అండ్ లైఫ్‌గార్డ్ సర్వీసెస్‌లో ఎనిమిదేళ్లుగా సేవలందిస్తున్నారు.