7 July, 2026 | 3:23 PM

Breaking News

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •   ప్రతి ఓటరును చైతన్యం చేయండి   •   ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు   •   మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్‌ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్   •   సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •  

అదనపు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఎం.డేవిడ్

02-12-2024 06:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీపై వచ్చిన ఎం. డేవిడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు కలెక్టర్ వెంకటేష్ దోత్రేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను మండల, జిల్లా అధికారులతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధి, విధి నిర్వహణలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ పర్యవేక్షకులు, జిల్లా అధికారులు బదిలీపై వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. గతంలో మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ఆయన విధులు నిర్వహించారు.