7 July, 2026 | 4:27 PM

మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్‌ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్

07-07-2026 03:04 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ  కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ విక్టర్ మంగళవారం మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో పర్యటించి ఎస్‌ఐఆర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామం, పోలింగ్ స్టేషన్ నెం. 251ను సందర్శించి బూత్ లెవల్ అధికారి, సూపర్వైజర్, తహసీల్దార్‌తో కలిసి ఇంటింటి ఎన్యుమరేషన్, ఓటరు వివరాల ధృవీకరణ, దరఖాస్తుల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్, బంజేపల్లి గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ పనులను సమీక్షించారు.  బీఎల్‌వోలు, సూపర్వైజర్లు, తహసీల్దార్‌తో మాట్లాడి ఇంటింటి సర్వే, ఫారాల స్వీకరణ, ఓటరు వివరాల నమోదు, డిజిటైజేషన్ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ పర్యటనలో సంబంధిత తహసీల్దార్లు, బూత్ లెవల్ అధికారులు సూపర్వైజర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.