16 June, 2026 | 9:27 PM

ఐతరాజు పల్లిలో విద్యార్థులకు అక్షరాభ్యాసం

16-06-2026 08:54 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు స్థానిక రామాలయం లో మంగళవారం అక్షరా భ్యాసం కార్యక్రమమునిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్  దీకొండ భూమేష్ కుమార్ మాట్లాడుతూ... విద్యే  వికాసానికి పునాది అని, ఒక స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ లక్ష్య సాధన కష్టతరమైనది కాదు అని, తన శక్తిని వినియోగించుకున్నట్లైతే సాద్యం కానిది ఏమి లేదని, పాఠశాల ప్రారంభంలో ఉపాధ్యాయులు అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.