16 June, 2026 | 9:51 PM

వైశ్య భవన్ లో యోగ సభ్యుల ఆధ్వర్యంలో యజ్ఞ నిర్వహణ...!

16-06-2026 09:09 PM

యజ్ఞ సహిత వల్ల ఆధ్యాత్మికత, పర్యావరణం మానసిక, ప్రయోజనాలు...!

యోగా గురుజి నాగరాజు గౌడ్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): హిందూ సనాతన ధర్మంలో యజ్ఞం (యాగం) చేయడం వల్ల ఆధ్యాత్మిక, మానసిక ,మరియు  పర్యావరణ ప్రయోజనాలు కలుగుతాయని యోగ గురుజి నాగరాజ్ గౌడ్ అన్నారు మంగళవారం ఉదయం యోగ సభ్యుల ఆధ్వర్యంలో. యజ్ఞం నిర్వహించారు యోగ సభ్యులైన మూడ దుర్గయ్య, పూసల రవీందర్, గూడ రామకృష్ణ దంపతులు వేదమంత్రాలు పటిస్తూ బ్రహ్మీ ముహూర్తంలో యజ్ఞం నిర్వహించారు. వేద ఆధ్యాత్మిక ఆచార్యులైన అన్నం దయానంద్, యోగ గురుజి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య యజ్ఞం నిర్వహించారు.

ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు నరసింహారావు మాట్లాడారు, ఉదయం యోగ సాధనకు రావడం ఒక వంతు అయితే యోగాకు ముందు అంటే ఉదయం నాలుగు గంటలకు లేవడం స్నానాధులు ముగించుకొని యజ్ఞంలో పాల్గొనడం అనితర సాధ్యం, ఎవరి వల్ల కాదు కానీ యోగ శిక్షణకు వచ్చే సభ్యులలో పట్టుదల, కృషి, సంకల్ప బలంతో మూడ దుర్గయ్య, పూసల రవీందర్, గూడ రామకృష్ణ ఈ ముగ్గురి కృషి అనితర సాధ్యం కానీ సాధించారు.

గత రెండు సంవత్సరాలుగా పట్టు వదలకుండా బ్రహ్మీ ముహూర్తంలో యజ్ఞాన్ని పూర్తి చేసేవారు అలా పూర్తి చేసిన అనంతరం యోగా సాధన చేసేవారు వారి కృషి ఫలితమే ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి లోనీ స్థానిక వైశ్య భవన్లో యజ్ఞం దిగ్విజయంగా నిర్వహించారనీ ఈ సందర్భంగా ఆయన అన్నారు , అనంతరం యోగా గురుజి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ యజ్ఞం చేయడం  వలన  అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్యంతో పాటు పర్యావరణ ప్రయోజనాలు, గాలి శుద్ధి, యజ్ఞంలో నెయ్యి, మూలికలు,  ప్రత్యేకమైన సమిధలను ఉపయోగించడం వల్ల వాతావరణం శుభ్రపడుతుందనీ ఇది గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను సూక్ష్మక్రిములను  నాశనం చేస్తుందని అన్నారు.

ఊపిరితిత్తులకు మేలు

యజ్ఞ సమయంలో వెలువడే పొగ, సువాసనలు శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తాయని, మానసిక ప్రశాంతతను ఇస్తాయనిఅన్నారు యజ్ఞం వలన.కాలుష్య నివారణ జరుగుతుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని  వాయు కాలుష్యం తగ్గుతుందని కొన్ని పర్యావరణ అధ్యయనాలు పేర్కొన్నాయి. దాంతోపాటు మన ఆరోగ్యం కు మానసిక  ఆధ్యాత్మిక ప్రయోజనాలు సానుకూల శక్తి యజ్ఞాలలో వేద మంత్రాల ఉచ్ఛారణ వల్ల ఉత్పన్నమయ్యే తరంగాలు ఇంట్లో లేదా పరిసరాలలో పాజిటివ్ ఎనర్జీని  నింపుతాయి.

ఒత్తిడి తగ్గింపు క్రమశిక్షణతో కూడిన యజ్ఞ ప్రక్రియలు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇది డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందిసకల జనుల శ్రేయస్సు , ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి, సమృద్ధిగా వర్షాలు కురవడానికి, లోక కల్యాణం కోసం దోహదపడతాయని పేర్కొన్నారు, భగవద్గీత పారాయణం లో ఇటీవల అవార్డు అందుకున్న పడిగెల రమాదేవి, గీత పారాయణం వినిపించారు. మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి భగవద్గీతను గ్రామాల్లోకి వెళ్లి మహిళలతో పారాయణం చేస్తున్నట్లు తెలిపారు, అనంతరం యజ్ఞం నిర్వహించిన ఇరువురికి శాలువాల తో సన్మానించారు.