కేంద్ర మంత్రిని కలిసిన ఆలపాటి
దమ్మపేట,(విజయక్రాంతి): హైదరాబాదులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan)ను తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్(Alapati Ramachandra Prasad), రైతు సంఘం రాష్ట్ర నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) సమక్షంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలు, మినిమం గ్యారంటీ ధరపై వినపత్రం అందజేశారు.
దక్షిణాది రాష్ట్రాల రైతాంగ సమస్యలు, ఆయిల్ ఫామ్ రైతు సమస్యలపై మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో శుక్రవారం హైదరాబాదులో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముందుగానే ఆలపాటి ప్రసాద్, నల్లమల వెంకటేశ్వరావు లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలిసి తెలంగాణలోని ఆయిల్ ఫామ్ పరిస్థితి, సాగు విస్తీర్ణం పెంచే విధంగా తీసుకుంటున్న చర్యల తో పాటు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు.