11 May, 2026 | 5:02 AM

తొమ్మిది మందీ ప్రత్యేకమే!

11-05-2026 03:55 AM

చెన్నై, మే 10: విజయ్ క్యాబినెట్‌లో తొమ్మిది మందీ ప్రత్యేకమే. ఈ మంత్రివర్గం లో అత్యంత పిన్న వయస్కురాలైన 29 ఏళ్ల ఒక పొలిటికల్ కన్సల్టెంట్ మహిళ, ఒక వైద్యుడు, మరొకరు దంత వైద్యుడు, ఇంకొకరు మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, ఓ క్రీడాకా రుడు, మరో నలుగురు నాయకులు ఉన్నా రు. ఈ మంత్రులందరూ తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీకి చెందినవారే కాగా, ఇందులో కాంగ్రెస్‌తోపాటు మద్దతు పార్టీలకు చెందిన ఏ ఎమ్మెల్యే కూడా లేరు.

అభిమాన సంఘం నుంచి మంత్రిగా ఎన్ ఆనంద్

నటుడు విజయ్ తన పార్టీని ప్రారంభించడానికి ముందే అతని అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఎన్ ఆనంద్ ఉన్నారు. విజయ్ చివరికి టీవీకేను నిర్మించడం ప్రారంభించినప్పుడు ఆనంద్ క్రియాశీలకంగా వ్యవహరిం చారు. ఆనంద్ పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఇప్పటికీ ఆ పదవిలో కొన సాగుతున్నారు. ఆనంద్ పార్టీ ప్రముఖ ప్రతినిధుల్లో ఒకరిగా కూడా ఎదిగారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే, టీవీకే నేతనే తమిళనాడు సీఎం అవుతారని ఆయన బహిరంగంగా ప్రకటించారు. త్యాగరాయనగర్ నినుంచి ఆయన గెలిచారు. 

బాస్కెట్‌బాల్ నుంచి మంత్రిగా ఆధవ్ అర్జున

6 అడుగుల 7 అంగుళాల ఎత్తుతో నిలిచే బాస్కెట్‌బాల్ జాతీయ స్థాయి మాజీ క్రీడాకారుడు ఆదవ్ అర్జున. ఈయన తమిళనా డుకు చెందిన ఒక రాజకీయ వ్యూహకర్త, పరోపకారి, క్రీడా నిర్వాహకుడు. గత ఎన్నికల్లో, ఆయన ఎంకే స్టాలిన్‌తో కలిసి పనిచే శారు. డీఎంకే విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని విల్లివాక్కం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీవీకేలో ఆయన ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తద్వారా పార్టీ అధ్య క్షుడు విజయ్, ప్రధానకార్యదర్శి ఎన్ ఆనం ద్ తర్వాత అత్యున్నతస్థాయి పార్టీ కార్యకర్తగా ఆధవ్ అర్జున నిలిచారు. 

పొలిటికల్ కన్సల్టెంట్ నుంచి మంత్రిగా ఎస్ కీర్తన

తమిళనాడు బాణాసంచా కేంద్రమైన శివకాశి ప్రజలకు దీపావళి ముందే వచ్చేసింది. ఎందుకంటే, దాదాపు ఏడు దశాబ్దాల పురుషాధిపత్యానికి తెరదించి, ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యే, 29 ఏళ్ల నటి ఎస్ కీర్తన. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో అతిపిన్న వయస్కురాలు. హిందీలో అనర్గళంగా మా ట్లాడగల కీర్తన, క్షేత్రస్థాయి రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల వ్యూహంలో కీలకపాత్ర పోషిస్తూ రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 1996 లో విరుధ్‌నగర్ జిల్లాలో పుట్టిన ఆమె గణితంలో బీఎస్సీ, ఎంఎస్సీ పట్టాలు పొందారు. 

మెడికల్ అధికారి నుంచి మంత్రిగా డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్

డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ తమిళనాడుకు చెందిన వైద్యుడు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారి. ఆయన టీవీకే పార్టీకి విధాన, ప్రచార వ్యవహారాల ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, కృష్ణగిరి పీహెచ్‌సీలో మెడికల్ అధికారిగా సేవలందించారు. 

దంతవైద్యుడు నుంచి మంత్రిగా డాక్టర్ టీకే ప్రభు

టీవీకే ప్రముఖ నాయకుడు డాక్టర్ టీకే ప్రభు. ఈయన దంతవైద్యుడు. ఎన్‌టీకే పార్టీ వ్యవస్థాపకుడు. ఈయన కారైకుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా గెలిచారు. నటుడైన సీమన్‌ను ఓడించారు.

10 సార్లు ఎమ్మెల్యే.. టీవీకేలో మంత్రి కేఏ సెంగోట్టియాన్

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అత్యంత సీనియర్ నాయకుల్లో కేఏ సెంగోట్టయాన్ ఒకరు. రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం. 10 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎంజీఆర్ హయాంలో 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జయలలిత, పళనిస్వామి హయాం లో మంత్రిగా పనిచేశారు. పలుశాఖలకు మంత్రిగా ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖ మంత్రి గా గుర్తింపు పొందారు. గతేడాది ఏఐడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురై, విజయ్‌తో చేతులు కలిపారు. 

టీవీకే కోశాధికారి, న్యాయవాది.. మంత్రి పీ వెంకటరమణన్

తొలిసారి ఎమ్మెల్యే అయిన పీ వెంకటరమణన్, టీవీకే కోశాధికారిగా, న్యాయవా దిగా కూడా ఉన్నారు. ఆయన చెన్నైలోని కీలకమైన మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. క్రియాశీల రాజకీయాలకు కొత్త. ఆయన 2000 నుంచి విజయ్‌కి మేనేజర్‌గా పనిచేశారు. 

టీవీకే డిజిటల్ విభాగం నుంచి మంత్రిగా నిర్మల్ కుమార్

టీవీకే ఐటీ, సోషల్ మీడియా శాఖ డిప్యూటీ జనరల్ సెక్రటరీ(డీజేఎస్)గా నిర్మ ల్ కుమార్ వ్యవహరించారు. మదురైలోని తిరుప్పరన్‌కుండ్రం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల అనంతరం వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరిపి, వారి మద్దతు కూడకట్టారు. తొలుత బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగంలో పనిచేసి,  తర్వాత కొంతకాలం అన్నాడేఎంకేనూ పనిచేశారు.2025లో టీవీకేలో చేరి, ఆ పార్టీ వ్యూహకర్తగా ఉన్నారు. ఇంజినీరింగ్, న్యాయశాస్త్రాల్లో గ్రాడ్యుయేటర్. 

నటుడు నుంచి మంత్రిగా రాజ్‌మోహన్

నటుడు, స్టాండ్- అప్ కమేడియన్, ప్రేరణాత్మక వక్త అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజమోహన్ ఆరుముగం. చెన్నైలోని ఎగ్మూ ర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఇప్పు డు విజయ్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. టీవీ యాంకర్, డైరెక్టర్ కూడా. టీవీకే ప్రచార కార్యదర్శిగా పనిచేశారు.