గొప్ప నేత సత్యమన్న
12-08-2026 03:04 PM
హన్వాడ: ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తూ నిరంతరం శ్రమించిన గొప్ప నేత మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఎర్ర సత్యం అని పెద్దదర్పల్లి గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజలకు ఎల్లప్పుడూ స్వార్థం లేని సేవలు అందిస్తే వారి గుండెల్లో పదిలంగా ఉంటామని చెప్పేందుకు ఎర్ర సత్యం జీవితం ఎంతో ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దదర్పల్లి గ్రామస్తులు రఘురాం గౌడ్ ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవీందర్ గౌడ్, వెంకటయ్య, శ్రీరాములు గౌడ్, యాదయ్య గౌడ్, రాములు గౌడ్, చిన్నరాయుడు, పి వెంకటయ్య, గొల్ల నర్సింలు, దెబ్బడి వెంకటయ్య, పద్మమ్మ, సత్యమ్మ, అంజమ్మ, గ్రామ పెద్దలు మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.






