12 August, 2026 | 5:49 PM

NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం

12-08-2026 03:48 PM

న్యూఢిల్లీ: NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ (NEET) పేపర్ లీక్ కేసులో సీబీఐ(Central Bureau of Investigation) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం పరిగణనలోకి తీసుకుంది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా 13 మంది నిందితులపై ఆ సంస్థ సమర్పించిన తుది నివేదికను పరిగణనలోకి తీసుకున్నారు. 13 మంది నిందితులపై సీబీఐ 20 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ( CBI Chargesheet) అభియోగాలపై రౌస్ అవెన్యూ కోర్టు రేపు వాదనలు విననుంది. "ప్రభుత్వ పరీక్షలలో ప్రశ్నపత్రాల లీకేజీ, ఇతర అక్రమ పద్ధతుల వినియోగానికి సంబంధించిన క్రిమినల్ కేసులను" విచారిస్తున్న ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుకు సీబీఐ ఇటీవల తన తుది నివేదికను సమర్పించింది. NTAకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్‌ నిపుణులే పేపర్‌ లీక్‌ చేసినట్లు CBI ఆరోపిస్తోంది. ఛార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలు ఉన్నాయని సీబీఐ వెల్లడించింది.